రామచంద్రపురంలో దారుణం.. అపస్మారక స్థితిలో వదిలేసి పనులకు వెళ్లిన నిందితురాలు..
రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్
టుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిత్యం జరిగే గొడవలు తీవ్రస్థాయికి చేరడంతో భార్య సందికాలు పొత్రంతో విచక్షణారహితంగా దాడి చేసి భర్తను హతమార్చిన ఘటన రామచంద్రపురం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.పోలీసులు తెలిపిన అధికారిక వివరాల ప్రకారం… స్థానిక అంకవార వీధి, పిల్లవారి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న తంగేటి ఎల్లారావు (46) గతంలో మొదటి భార్య వేధింపుల కారణంగా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అనంతరం ఎల్లారావు సుమారు 15 ఏళ్ల క్రితం ఉమాదేవి (30)ని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఈనెల 24వ తేదీ రాత్రి సుమారు 9:00 గంటల ప్రాంతంలో దంపతుల మధ్య మరోసారి తీవ్ర ఘర్షణ చెలరేగింది. మాటామాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన ఉమాదేవి, ఇంట్లో ఉన్న సందికాలు పొత్రం (రుబ్బురోలు బండ)తో భర్త ఎల్లారావు తల, వీపు, కుడిచేతి భాగాలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఎల్లారావు స్పృహతప్పి పడిపోయాడు.అపస్మారక స్థితిలో వదిలేసి పనులకు..తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న భర్తను పట్టించుకోని నిందితురాలు, మరుసటి రోజు (25వ తేదీ) ఉదయం 5:00 గంటలకు అతను నీళ్లు అడగడంతో తాగించి, స్పృహతప్పి ఉన్న స్థితిలోనే వదిలేసి తాను ఇళ్లలో చేసే పాచి పనులకు వెళ్లిపోయింది. ఉదయం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి భర్తలో చలనం లేకపోవడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించింది. ఆయన పరిశీలించి ఎల్లారావు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.దీంతో ఉమాదేవి ఉదయం 9:45 గంటల సమయంలో మృతుడి తమ్ముడు తంగేటి సూరిబాబుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న ఎల్లారావు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.మృతుడి సోదరుడు సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు నిందితురాలు ఉమాదేవిపై క్రైమ్ నెం. 131/2026, సెక్షన్ 103(1) (భారతీయ న్యాయ సంహిత) కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.