భావి భారతాన్ని తీర్చిదిద్దే అక్షర శిల్పులు మన ఉపాధ్యాయులే
ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుభాకాంక్షలు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవ సమాజ నిర్మాణంలో,విద్యార్థులలో నైతిక విలువలు నూరిపోస్తూ వారిని క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సమాజంలో మార్పునకు, పురోగతికి మూలస్తంభాలు ఉపాధ్యాయులే. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, విజ్ఞాన దీపాలు వెలిగించే గురువుల...