రహదారి ప్రక్కనే ఇసుక మేటలు వాహనదారులకు ఇక్కట్లు.

సీతానగరం విశ్వం వాయిస్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో పెట్రోల్ బంక్ సమీపంలో రహదారిని ఆనుకొని ఇసుక మేటలు కొండలను తలపిస్తున్నాయి. ఈ ఇసుక మేటల వలన ద్విచక్ర వాహనదారులు ప్ర యాణం చేస్తున్నప్పుడు కళ్ళలోకి ఇసుక దూసుకొస్తుందంటూ వాహనదారులు బాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.