రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో రూ.30 లక్షల భారీ కుంభకోణం

రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. డిపోలో సుమారు రూ.30,05,373 మేర నగదు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి డిపో క్లర్క్ ఏ.పీ.కె. రావు (E.306977) పై డిపో మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణం విషయం బయటపడటంతో సదరు క్లర్క్ ఆగస్టు 18వ తేదీ నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ మరియు అకౌంట్స్ అధికారులు డిపోలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో క్యాష్ గల్లంతు మాత్రమే...