వన సమారాధనలు సామాజిక ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకలు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనలు ప్రకృతితో మమేకం కావడంతో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి చక్కని వేదికలుగా నిలుస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నున్న యజ్ఞ గార్డెన్స్‌లో ఆదివారం విజయవాడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శెట్టిబలిజ సామాజిక వర్గంలోని వారంతా కుటుంబ సమేతంగా ఒకచోట చేరి పరస్పర పరిచయాలు, స్నేహ సంబంధాలను...