గోకవరం, East Godavari (VISWAM VOICE DESK):
-
గోకవరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న భారీ వృక్షం కొమ్మ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విరిగి రోడ్డుపై పడింది. రెండు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమ్మను వెంటనే తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.