వైసీపీ నేతల తీరుపై కూటమి నేతల తీవ్ర ఆగ్రహం
ఉనికి కోసమే దేవుని పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధం.. వైసీపీ నేతలు సిద్ధమా వైసీపీ నేతలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే దేవాలయ అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని కూటమి పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్ 2 ఇన్చార్జ్ కంచుమర్తి బాబురావు, అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి సిర్రా సురేష్, సీనియర్ నేత రవ్వా భూషణంలు విమర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.ఈ సందర్భంగా...