శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారంలో వాస్తవాలు దాచి కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు

ప్రొసీడింగ్స్ ఆధారంగా వాస్తవాలు వెల్లడించిన మంత్రి సుభాష్ ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు, రాజకీయ నాటకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను దాచి, వాటి నెపాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో,...