VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 4:30 pm Posted by : BOMMU DURGARAO

సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని చిన్నారి నిరసన

ద్రాక్షారామ : విశ్వం వాయిస్ న్యూస్
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో యాట్ల వైష్ణవి సిరి మహాలక్ష్మి అనే చిన్నారి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్థానిక సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఆ చిన్నారి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించింది. అనంతరం మహిళల విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన గొప్ప త్యాగాలను స్మరిస్తూ, కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను సావిత్రిబాయి పూలేకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డుతో నిరసన తెలిపింది. బాలిక స్వయంగా సావిత్రిబాయి పూలే వేషధారణలో నిరసన తెలుపుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా అందరి ప్రశంసలను అందుకుంది.