స్వర్గీయ రత్నకిషోర్ కుటుంబానికి విశ్వం వాయిస్ సంస్థ 20వేలు ఆర్థిక చేయూత

విశ్వం వాయిస్ కు రత్నకిషోర్ లోటు ఎనలేనిది. కోరుకొండ జూలై (విశ్వం వాయిస్ న్యూస్) విశ్వం వాయిస్ దినపత్రికకు స్వర్గీయ కుడెల్లి రత్నకిషోర్ చేసిన సేవలు ఎనలేనివని విశ్వం వాయిస్ అధినేత ఖండవిల్లి సునీల్ కుమార్ కొనియాడారు. సోమవారం స్వర్గీయ రత్నకిషోర్ పెద్దకార్యం రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వం వాయిస్ అధినేత సునీల్ కుమార్ తో పాటు పలు మండలాల నుండి విశ్వం వాయిస్ పాత్రికేయులు విచ్చేసి, రత్న కిషోర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...