హైస్కూల్ ప్రాంగణంలోని కూలిన వృక్షం… ఎవరి సొత్తు?

హైస్కూల్ ప్రాంగణంలోని కూలిన వృక్షం… ఎవరి సొత్తు?   * ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్న వైనం * పట్టని విద్యాశాఖ అధికారులు   రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్: రాయవరం ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ఇటీవల కూలిపోయిన భారీ వృక్షం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉన్న వృక్షం ప్రభుత్వ ఆస్తిగా పరిగణించాల్సి ఉండగా, దానిని ఎలాంటి అధికారిక ప్రక్రియ లేకుండా బయట వ్యక్తులు యంత్రాలతో  ముక్కలుగా నరికి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్టు తొలగింపుపై పాఠశాల యాజమాన్యం, విద్యాశాఖ లేదా గ్రామపంచాయతీ నుంచి...