ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

తోట వర్సెస్‌ వేగుళ్ల …! రసవత్తరంగా మండపేట రాజకీయం

 

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

సాధారణ ఎన్నికలు జరిగి రెండు ఏళ్ళు పూర్తయ్యాయి.. కార్యకర్తలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. రాజకీయ పరమైన పరిణామాలు చోటుచేసుకునే నియోజకవర్గాల్లో బహుస్వల్పం అలాంటి నియోజకవర్గ మే మండపేట.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.. ఎన్నికలు ముగిసిన తర్వాత తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

టీడీపీకి కంచుకోట… మండపేట
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మండపేట నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అక్కడ జయకేతనం ఎగురవేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వేగుళ్ళ జోగేశ్వరరావు ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. కాపులు, శెట్టిబలిజ ల జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వేగుళ్ల తన పట్టును నిలుపుకోవడం లో విశేషం. గత ఎన్నికలలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ తరఫున బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన మండపేట టీడీపీ కంచుకోట అని వేగుళ్ళ తన విజయంతో చాటారు.

రంగంలోకి దిగిన తోట త్రిమూర్తులు:
రాబోయే ఎన్నికలలో మండపేటలో జెండా ఎగురవేయాలని వైసిపి లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికలలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రంగంలోకి దింపిన వైసిపి. రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన తోట త్రిమూర్తులు ను బరిలో దించేందుకు సిద్ధమైంది. మండపేట సరిహద్దు నియోజకవర్గమైన రామచంద్రపురానికి చెందిన తోట త్రిమూర్తులు పలుమార్లు పలు పార్టీల తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు సామాజిక వర్గం లో బలమైన నేతగా తోట త్రిమూర్తులుకు పేరుంది..
2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తోట ప్రయత్నాలు చేశారు. అయితే అవి ఫలించకపోవడంతో తెలుగుదేశం పార్టీ తరఫున సిటింగ్ స్థానం రామచంద్రపురం నుంచి పోటీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత కొంత కాలానికే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు. బలమైన నాయకుడు కావడంతో తోటను సాదరంగా ఆహ్వానించిన వైసిపి…ఆయనకు అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దాంతోపాటు మండపేట కోఆర్డినేటర్ గా ను నియమించింది. కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచే పార్టీ నిర్దేశించిన లక్ష్యం వైపు తోట అడుగులు వేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ… కార్యకర్తలో జోష్ నింపారు. మూడు పర్యాయాలు ఓటమిని చవి చూసిన టిడిపి వ్యతిరేక వర్గం తోట రాకతో ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో.. మూడున్నర దశాబ్దాల తర్వాత మండపేట మున్సిపాలిటీ ని టిడిపి కోల్పోయింది. 30 వార్డులు గాను 22 వార్డులలో గెలిచిన వైసీపీ.. మండపేట మున్సిపాలిటీ పై తన జెండాను ఎగుర వేసింది… ఈ విజయం మండపేట భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచిక అయింది

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు