ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

జగ్గంపేటలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు*

జగ్గంపేటలో జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

జగ్గంపేట(విశ్వం వాయిస్ న్యూస్ ):

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న తోడు కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల కు రెండు కోట్ల 8 లక్షల 80 వేల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారులు మరియు సంప్రదాయ వృత్తి దారులు పెట్టుబడి నిమిత్తం మరియు వ్యాపార అభివృద్ధి కొరకు వడ్డీలేని పెట్టుబడి కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి అమరావతి నుంచి ప్రారంభించడం జరిగింది.అందులో భాగంగా ఆ కార్యక్రమాన్ని సంఘీభావంగా జగ్గంపేటలో జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు .వ్యాపారులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల వరకు శ్రీనిధి బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాన్ని ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. చిరువ్యాపారులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేసుకోవాలని జగనన్న తోడు రెండో దఫా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జనపరెడ్డి సుబ్బారావు, ఒమ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, అప్పారావు కాపు, చదలవాడ బాబి, పెంటకోట నాగబాబు, చల్ల గల దొరబాబు అడబాల ఆంజనేయులు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, జగ్గంపేట ఎస్ ఐ టీ. రామకృష్ణ, బచ్చల సుధీర్ నిమ్మల పొడి శ్రీహరి కాపవరపు ప్రసాద్ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు