ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం*

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం*

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్:

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాకినాడ పార్లమెంటరీ బిజెపి కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ పిలుపుమేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే విధంగా లేదని, రైతులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతుంటే దాన్ని పట్టించుకోకుండా రైతుల పట్ల పక్షపాతం వ్యవహరిస్తోందన్నారు. ఎందుకంటే రైతు ఆరుగాలం పనిచేసి పండించిన పంటను ఒక్క ధాన్యం గింజ కూడా వదలకుండా మొత్తం కొనుగోలు చేస్తానన్నా ఈ ప్రభుత్వం ఈ 45 లక్షల టన్నుల ధాన్యం ఉంటే 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన ఇరవై నాలుగు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా మూడు లక్షల 16 వేల 540 మందికి టోకెన్లు ఇచ్చి మద్దతు ధర కల్పించి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 66 వేల 800 పద్నాలుగు మంది మాత్రమే టోకెన్లు ఇచ్చిందన్నారు. మిగిలిన రైతులందరికీ కూడా టోకెన్ లో ఇవ్వకపోవడానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదన్నారు. ప్రభుత్వం అంటే అందర్నీ సమాన దృష్టితో చూడాలన్నారు. రైతులందరూ దగ్గర ధాన్యాన్ని కొన్ని మద్దతు ధర 75 కేజీలు బస్తాకు 1400 రూపాయల ఇచ్చి రైతులను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ చిన్చాయి యోజన క్రింద ఇచ్చిన 412 కోట్లు, నాబార్డు తరపున వచ్చిన 616 మొత్తం కలిపి ఒక వెయ్యి 28 కోట్ల రూపాయలు సూక్ష్మ సేద్యం ద్వారా ఉపయోగించవలసిన పనిముట్లను కొన్ని రైతుల కు అందజేసిన లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లను అందించాలన్నారు. అకాల వర్షం వల్ల రైతుల చేతికి అందాల్సిన పండంత పాడైపోయిందని రైతును ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రంగు మారిన ధాన్యాన్ని కి కనీస మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల కష్టాన్ని మిల్లర్లు, దళారులు దోచుకోకుండా ప్రభుత్వం కల్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు