ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం…

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలకు చలించిపోయి వారికి లబ్ధి చేకూర్చేందుకు జగన్ అన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారని మండపేట వైయస్ ఆర్ సిపి తోట త్రిమూర్తులు. పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం లో మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన జగనన్న తోడు కార్యక్రమం రాయవరం గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణం మంజూరు చేసే జగనన్న తోడు కార్యక్రమానికి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా 3.7 లక్షల అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లో నేరుగా రూ.370 కోట్లు జమ చేసిన ఘనత సీఎం వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి దే అన్నారు.జిల్లాలో 33,438 మంది చిరు వ్యాపారులకు జగనన్నతోడు పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు తెలియజేశారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని 23,234 మందికి, పట్టణాల్లో 10,204 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున రుణం అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34,438 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు మంగళవారం ఈ సొమ్ములు జమ అవుతాయని తెలిపారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు సెర్ఫ్‌ బ్యాంకు ద్వారా, పట్టణాల్లో ఏపీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ద్వారా రుణాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వడ్డీలేని రుణం కింద వీటిని అందజేయనున్నారని, 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మండపేట నియోజకవర్గంలో రూ.1 కోటి 16 లక్షలు రూపాయల నగదును తోట త్రిమూర్తులు చేతులమీదుగా చెక్కును ప్రారంభించారు.
రాయవరం మండలం లో రెండో విడత కు గాను కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారు 560 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమచేయ బడ్డాయి తెలియజేశారు.ఈ నేపద్యంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి వనజానవీన్ రెడ్డి మాట్లాడుతూ
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. నిరుపేదలు, రోడ్లమీద, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వడ్డీ వ్యాపారస్తుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటూ, బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక, అవస్ధలు పడుతూ.. అష్టకష్టాలు పడుతున్న వారికి… మంచి చేసే కార్యక్రమం జగనన్న తోడు రెండోదశకు మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దయతో శ్రీకారం

మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి వనజానవీన్ రెడ్డి మాట్లాడుతూ

చుడుతున్నామన్నారు.
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్ళారా చూసిన మన ముఖ్యమంత్రి వ్యవస్థలను, బ్యాంకులను పేదవాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లుగా ఖచ్చితంగా భావించాలి అని. పాదయాత్రలో కూడా పేదలకు సంబంధించి ఎన్నెన్నో కథలు చూశారన్నారు. పేదలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వంద రూపాయలకు రోజుకు పది రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి వారిదని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి, వడ్డీలేని రుణాలు వారికి దొరుకుతాయా అంటే… ఎక్కడా అటువంటి పరిస్థితి కనిపించ లేదు. అటువంటి వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికవడ్డీలకు అప్పులు తీసుకుని వందరూపాయలకు రోజుకు పదిరూపాయలు కడుతూ జీవితాన్ని నడుపుతున్నారు. ఇవన్నీ చూసిన తరువాత పాదయాత్ర సమయంలో వీరి తలరాతలు మార్చే అవకాశం దేవుడు ఇస్తే, ఖచ్చితంగా మారుస్తాను అని మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారని అన్నారు. అదే విషయాన్ని మేనిఫేస్టోలో పెట్టి. ఈ రోజు దానిని సంతృప్త స్థాయిలో అమలు చేస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు.

రాయవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మల్లపురెడ్డి శ్రీను మాట్లాడుతూ

రాయవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మల్లపురెడ్డి శ్రీను మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న తోడు పథకం ద్వారా దాదాపుగా రుణాలు అందుతున్నాయి అని అన్నారు… అర్హులు ఎవరని చూస్తే… గ్రామాలలో సుమారు పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు స్థలం, అంతకన్నా తక్కువ స్థలంలో శాశ్వత, తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసుకున్న వారు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు లో అమ్ముకునేవారు, తదితర వృత్తులపై ఆధారపడిన చిరు వ్యాపారులందరికీ జగనన్న తోడు కింద పదివేల రూపాయలు వడ్డీలేని రుణాలు చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండలం లోని గ్రామ సర్పంచులు మండల అధికారులు మహిళా సంఘాల యానిమేటర్లు, రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకట రెడ్డి, వై సి పి ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు