ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారయత్నానికి ఒడిగట్టిన వారిపై కేసు నమోదు..

వివాహిత పై అత్యాచార యత్నం

ప్రతిఘటించిన మహిళ

చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు

పోలీసులు విచారణ

గతంలోను ఇలాంటి ఘటనే

మద్యం మత్తులో అకృత్యాలు

ఇద్దరు మైనర్లు

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

మండలంలోని వెంటూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్. సురేష్ మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వెంటూరు గ్రామంలో వివాహిత భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేయాలని అనుకున్నారు. సోమవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. నలుగురూ అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించగా మహిళ కేకలు వేయడంతో అక్కడినుంచి పారిపోయేందుకు యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికక్కడే ముగ్గురు యువకులను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. వారికి దేహశుద్ధి చేశారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. బర్త్‌ డే వేడుకల పేరుతో పీకల మద్యం తాగి ఈ ఘాతుకానికి పూనుకున్నారు.

మద్యం మత్తులో వివాహిత మహిళ పై నలుగురు యువకులు కన్నేశారు. వెంటూరు కి చెందిన చొల్లంగి మణికంఠ స్నేహితులకు బాధితురాలు ఇంటి సమీపంలో అర్ధరాత్రి మద్యం పార్టీ ఇచ్చాడు. తెల్లవారు సమయం లో మణికంఠ, రామచంద్రపురం మండలం జగన్నాయకపాలెం కు చెందిన వీధి లక్ష్మయ్య, మరో ఇద్దరు మైనర్ బాలురు వివాహిత ఇంట్లో కి వచ్చారు. నిద్రిస్తున్న ఆమె తల వద్ద ఇద్దరు, కాళ్ళ దగ్గర ఇద్దరు నిలుచొని తాళ్లతో కట్టేసే ప్రయత్నం చేశారు. ఇంతలో మెలుకువ వచ్చిన ఆమె ఒక్కసారిగా ప్రతిఘటించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆమె పెద్దగా కేకలు వేయడం తో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. రాత్రి కావడంతో కుక్కలు పెద్దగా మొరగడం తో స్థానికులు ఇళ్ల బయటి కి వచ్చారు. పారిపోతున్న ముగ్గురు యువకులను పట్టుకున్నారు. ఓ యువకుడు తప్పించుకొని పరారయ్యాడు. దొరికిన వారిని అక్కడే చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. ఎస్సై సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరిగా నివశిస్తోన్న మహిళపై ఈ తరహా అఘాయిత్యానికి యత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు….

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు