ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

లోతట్టు ప్రాంత కోవిడ్ బాధితులకు భోజనం,బిర్యానీ పంపిణీ

లోతట్టు ప్రాంత కోవిడ్ బాధితులకు భోజనం,బిర్యానీ పంపిణీ

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని లోతట్టు గిరిజన ప్రాంతా లైన లోదొడ్డి, వాతంగి,వంచంగి‌, జడ్డంగి గ్రామ సచివాలయాలు కు చెందిన రూరల్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న 127 మంది కోవిడ్ పేషెంట్లకు  బుధవారం, చికెన్ బిర్యానీ ,భోజనం జడ్డంగి  సర్పంచ్ కొంగర మురళీకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జడ్డంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 2009 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, వైసిపి మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ సోదరి ఎర్రం శెట్టి లక్ష్మి, మార్కండేయులు, పొట్నూరి గణేష్ లు అందించిన  ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు  మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ తెలిపారు.  తోటి మానవులకు ఆపదలో సహాయపడాలనే వారి ఉదార స్వభావానికి కృతజ్ఞతలు తెలిపారు. వంటల పంపిణీలో సహకరించిన బద్రి రెడ్డి శ్రీధర్ కుటుంబం, అడపా కామేష్ , గుడివాడ రాజేష్ , తాటికొండ బ్రదర్స్  సాయి, భవాని, పొడుగు ప్రసాద్  లను  అభినందించారు.కోవిడ్ పేషెంట్లు పట్ల  దాతలు చూపిన ప్రేమాభిమానాని కి వైసీపీ మండల కన్వీనర్   సింగిరెడ్డి రామకృష్ణ  ధన్యవాదాలు తెలిపారు. లోదొడ్డి పంచాయతీలో  కోవిడ్ 19  సహాయక కార్యక్రమాల్లో  పాల్గొని పది రోజుల క్రితం కోవిడ్  బారినపడి తమ  స్వగ్రామం కేశవరం లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న గ్రామ సర్పంచ్ లోతా రామారావు ని మురళీకృష్ణ కలుసుకుని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాతంగి సర్పంచ్ భీమిరెడ్డి సుబ్బలక్ష్మి, నాని, ఉప సర్పంచ్ రాళ్ల గడ్డ అర్జున్, లోదొడ్డి దేవుడు, రుంజా మరియమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు