ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

ముంపుగ్రామలను పర్యటించన జిల్లా కలెక్టర్…..

ముంపుగ్రామలను పర్యటించిన జిల్లా కలెక్టర్……

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ దేవీపట్నం……..

ముంపు గ్రామాలను పర్యటించిన జిల్లా కలెక్టర్……..

గోదావరి వరదలు సమీపిస్తున్నందున వరద సహాయక చర్యలకు యంత్రాంగం సర్వం సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి తెలిపారు బుధవారం ఆయన స్థానిక కార్యాలయం నందు వరద సహాయక చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను తిలకించి ఏ ఒక్క ప్రాణహాని కి
తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు గోదావరి వరదలు సహాయక చర్యల పై సన్నద్ధత పై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని ముందసు చర్యలు గ్రామాలలో హెచ్చరికలు చేస్తూ పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు గోదావరి వరద ముంపు గ్రామాల్లో మూడు నెలలకు సరిపడా నిత్యావసరాల నిలువలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు పునరావాస కాలనీ నిర్మాణాలు పూర్తయిన వాటిని నిర్వాసితుల కు అప్పగించి నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు పునరావాస నిర్మాణాలు పూర్తి కానీ వాటికి సంబంధించిన నిర్వాసితుల ను ముంపు గ్రామాల నుండి తరలించి తాత్కాలిక పునరావాసం కల్పించాలన్నారు కాపర్ డ్యామ్ మూలంగా గత ఏడాది కన్నా ఈ ఏడాది సుమారు ఐదు నుండి ఏడు మీటర్లు స్పిల్ వే పై వరద నీరు ప్రవహించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు కావున వరద ముంపు ఎక్కువగా ఉంటుందని ఆ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అన్నారు ముందుగా ముంపు గ్రామాల్లో సర్పంచులు సహకారంతో వరద పరిస్థితులపై ముంపు బాధితులకు అవగాహనను పెంపొందించి అనుగుణంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ఇంకా సుమారు 6 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల ప్రాణాలు పూర్తి కావలసి ఉందని మిగిలిన పునరావాస కాలనీలు ఇప్పటికే పూర్తయ్యాయని కాలనీ కి సంబంధించిన నిర్వాసితులు అందరూ గృహాలలో నివాసాలు ఉండాలని సూచించారు పునరావాస కేంద్రాలు సంబంధించిన నిత్యవసర వస్తువులు కిరోసిన్ పడవలు అందుబాటు వంటి ముందస్తు చర్యలు పక్కాగా నిర్వహించాలన్నారు జనరేటర్లు వైర్లెస్ ఫోన్లు వంటి అత్యవసర సామాగ్రి కూడా అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు సురక్షితమైన తాగునీరు ముంపు బాధితులకు అందించాలని ఆదేశించారు గత ఏడాది ఉత్పన్నమైన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలి ముంపు బాధితుల కు చెందిన పశువులను ఒక పెద్ద స్థలానికి చేర్చి అక్కడే పశుగ్రాసం సరఫరా చేయాలని సూచించారు పునరావాస కాలనీలు నిర్మాణాలపై ఆయన సమీక్షిస్తూ జూలై 31 నాటికి అన్ని కాలనీ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు పంచాయతీ రాజ్ రహదారులు భవనాల శాఖ లకు అప్పగించిన కాలనీ గృహాలు మరింత పురోగతి సాధించాల్స ఉందని అందుకు అనుగుణంగా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు భూమికి భూమి కింద ఇచ్చిన భూములను సర్వే చేసి నిర్వాసిత లబ్ధిదారులకు హద్దులు ఏర్పాటు చేసి పట్టాలు జారీ చేయాలని ఆర్టీవో లను ఆదేశించారు చిన్నచిన్న భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు నిర్వాసితులకు జాబ్ కార్డులు అందించి నరేగా ద్వారా ఉపాధి పనులు కల్పించాలని సూచించారు పునరావాస కాలనీల్లో కాంట్రాక్టర్ సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బందితో గ్రీవెన్స్ సెల్ కేంద్రం ఏర్పాటు చేసి నిర్వాసిత గృహాలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు అందిన వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు గృహాల లీకేజీలు వంటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కాంట్రాక్టర్ ద్వారా రెండు సంవత్సరాల పాటు గృహాల నిర్వహణకు సంబంధించిన పనులు నిర్వహింప చేయాలని ఆదేశించారు గృహ నిర్మాణాల తో పాటు మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రాధాన్యత నిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు కాలనీలో ఎలక్ట్రిసిటీ తాగునీరు డ్రైనేజ్ రహదారులు వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు అనంతరం వివిధ అభివృద్ధి నిర్మాణపరమైన రహదారులు భవనాలకు సంబంధించిన స్థల సేకరణ లో ఉత్పన్నమైన అటవీ అభ్యంతరాల పరిష్కారంపై ఇంజనీరింగ్ శాఖల వారీగా పరిష్కారాల పురోగతిపై ఇంజనీర్లతో సమీక్షించారు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం రహదారులకు స్థలాలు సేకరించు కోవాలని ఆయన సూచించారు వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణాలలో ఉత్పన్నమైన సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య చింతూరు వెంకటరమణ పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనాధికారి ఆనంద్ ఏ ఎస్ పి బిందు మాధవి ఆర్టీవో చైనా నాయక్ ఆర్ అండ్ బి ఎస్ఇ ప్రసాద్ పంచాయతీరాజ్ ఎస్ఇ నాగరాజు వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు