ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

గిరిజన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలి సిపిఐ డిమాండ్…..

దేవీపట్నం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దేవీపట్నం విశ్వం వాయిస్ న్యూస్…..

*గిరిజన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలి సిపిఐ డిమాండ్…….**

 

రంపచోడవరం డివిజన్ ప్రాంతంలో వై రామవరం మండలం కోట పంచాయతీ పరిధిలో కోట నుంచి వలస గ్రామం మీదుగా చింతలపూడి వరకు కోట నుండి తాడి కోట వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది బుధవారం రోజు సిపిఐ డివిజన్ బృందం వైరామవరం మండలం కోట పంచాయతీ పరిధిలో గల కొన్ని గ్రామాల్లో సందర్శించింది ఈ సందర్భంగా సిపిఐ డివిజన్ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ వైరామవరం మండలం లో మారుమూల ప్రాంతాల్లో చాలా గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని కుమార్ అన్నారు గ్రామాల్లో వైద్య సౌకర్యాలు కుంటు పడిపోయాయని ఆ గ్రామాల ప్రజలు కనీస అవసరాల నిమిత్తం మండలకార్యాలయానికి వెళ్లాలన్న రోడ్డు మార్గాలు కూడా లేవని కిలోమీటర్ల మేర నడి సి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కుమార్ అన్నారు ప్రభుత్వాలు మారుతున్న గిరిజన ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని కుమార్ ఆవేదనచెందారు మారుమూల ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలు ఎవరితో చెప్పుకుంటే పరిష్కారం అవుతాయో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారని కుమార్ అన్నారు ఏజెన్సీ ప్రాంతానికి ఐటీడీఏ కార్యాలయం పేరుకు మాత్రమే ఉందని అభివృద్ధి మాత్రం మచ్చుకైనా కనబడడం లేదని అన్నారు తక్షణమే మారుమూల గ్రామాల్లో రోడ్లు నిర్మాణం పట్ల ఐటీడీఏ పీవో గారు శ్రద్ధ చూపించాలని కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో వలస గ్రామ ప్రజలు చిన్నారెడ్డి రామ్ రెడ్డి కడప రెడ్డి పార్టీ మండల నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు