ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

26.1 C
Kākināda
సోమవారం, జూన్ 14, 2021
spot_img

సారా బట్టి పై పోలీసులు దాడి*

సారా బట్టి పై పోలీసులు దాడి*

మూడు వేల లీటర్ల బెల్లపు ద్వంసం.

50 లీటర్ల సారాతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

జగ్గంపేట మండలం జగ్గంపేట శివారు పోలవరం కాలువ దగ్గరలో పంటపొలాల్లో రహస్యంగా సారా కాపు కాస్తున్నట్లు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణకు వచ్చిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో గురువారం సాయంత్రం సారా బట్టి పై దాడి చేశారు. దీనికి సంబంధించి జగ్గంపేట ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట-గుర్రప్పాలెం రోడ్డులో శివారు పంటపొలాల్లో పొదల మాటున రహస్యంగా సారా బట్టి ఏర్పాటు చేసి,సారాను తయారు చేస్తున్నట్లు తనకు సమాచారం వచ్చిందని ఈ మేరకు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అక్కడ సారా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో భారీ సంఖ్యలో ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన సుమారు మూడు వేల లీటర్ల బెల్లం ఊటన్ను ధ్వంసం చేశారు. దీంతోపాటు సారా తయారు చేస్తున్న పొయ్యి నీ ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో సారా తయారీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను,50 లీటర్ల సార్ తో అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా రహస్యంగా సారా తయారు చేసిన లేదా అమ్మిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ దాడులలో పోలీస్ సిబ్బంది రెడ్డి, రాధాకృష్ణ,సోమరాజు తదితరులు ఉన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు