ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి..! ఆనందోత్సాహాలలో కార్యకర్తలు..

తోటకు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఉన్న సీఎం జగన్

మండపేట,విశ్వం వాయిస్ న్యూస్:

మండపేట ట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట త్రిమూర్తులను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న మండపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అయిన మండపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 23 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ పదవిని వైసీపీ దక్కించుకోవడం అలాగే పంచాయతీ ఎన్నికలలో అత్యధిక పంచాయతీలు వైసీపీ ఖాతాలోకే జమ అయ్యేటట్టు చూడడంలో తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గ చరిత్రను తిరగ రాశారు. అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా త్రిమూర్తులు తన మార్కును చూపిస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్రిమూర్తులు మండపేట నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కొనసాగుతుంది. అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ , టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు తోట త్రిమూర్తులు నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మండపేట నియోజవర్గంలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని అన్ని సమావేశాలలో తమదే పైచేయిగా ఉండాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలియవచ్చింది. దీనికి అధికారకంగా మంచి పదవిని త్రిమూర్తులకు కట్టబెట్టాలని పార్టీ వర్గాలు తలపోస్తున్నట్లు తెలియవచ్చింది. దాంతో ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్ట పెడతారన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ పదవులు ఎక్కువ ఖాళీ అవడంతో ఎమ్మెల్సీ కి త్రిమూర్తులు పేరును ఖరారు చేస్తున్నట్లు రూఢిగా తెలిసింది.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు