ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసిన ఏ ఎస్ పి బిందు మాధవ్

కరోనా బాధితులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేసిన ఏ ఎస్ పి బిందు మాధవ్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:  మండలంలోని జడ్డంగి పి హెచ్ సి పరిధిలోని  కోవిడ్ బారినపడి రూరల్ ఐసోలేషన్, హోం ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు శుక్రవారం రంపచోడవరం అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ డ్రై ఫ్రూట్స్ కిట్లను అందజేశారు, జడ్డంగి  కోవిడ్ సెంటర్లో వైద్యం పొందుతున్న పేషెంట్లకు తొలుతగా  డ్రై ఫ్రూట్స్  అందజేశారు. అనంతరం వంచంగి, మారేడుబాక, వాతంగి , జడ్డంగి సర్పంచులకు డ్రై ఫ్రూట్స్  కిట్లను ఇచ్చి ఆయా పంచాయతీల పరిధిలోని  కోవిడ్ బాధితులకు అందజేయమన్నారు. ప్రతి ఒక్కరు  మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ  కోవిడ్ నిబంధనలు  ఉల్లంఘించరాదన్నారు.  కోవిడ్ బారినుండి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీఐ  ఎం నాగ దుర్గారావు, ఎస్ ఐ లు లంకా రాజేష్, గోపి నరేంద్ర ప్రసాద్, మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ,  సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ, అడపా కామేష్. వైద్యాధికారి సుజీ. హెచ్ఎం శైలజ, రైటర్ కిషోర్, పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు