ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

కుటుంబ సమేతంగా అభిషేక సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ

తిరుపతి, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్:

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆయనను టీటీడీ అధికారులు మర్యాద పూర్వకంగా శేష వస్త్రంతో సత్కరించి.. తీర్ధ ప్రసాదాలు అందించారు.

అఖిలాండం వద్ద ఎన్వీ రమణ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బేడి ఆంజనేయస్వామిని జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చానన్నారు.

న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు