ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

31.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

కోవిడ్ పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ పంపిణీ చేసిన ఏజెన్సీ మిషనరీ క్రీస్తు పరిచర్య వ్యవస్థాపకులు.

కోవిడ్ పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ పంపిణీ చేసిన ఏజెన్సీ మిషనరీ క్రీస్తు పరిచర్య వ్యవస్థాపకులు.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి: తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన  రాజవొమ్మంగి మండలంలో కోవిడ్  బారినపడి వాక్-ఇన్ సెంటర్, రూరల్ ఐసోలేషన్, హోమ్ ఐషో లేసన్ లో ఉండి  వైద్యం పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు శుక్రవారం, శనివారం డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ ఏజెన్సీ మిషనరీ క్రీస్తు పరిచర్య( వాతంగి, తంటికొండ) వ్యవస్థాపకులు డి డి ఎస్ మనోహర్ రాజు అందజేశారు. శుక్రవారం రాజవొమ్మంగి  వాక్-ఇన్ సెంటర్లో గ్రామ సర్పంచ్ రమణి ఆధ్వర్యంలో 80 మంది కోవిడ్ పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, స్నాక్స్ అందజేయడం జరిగింది. శనివారం దూసర పాము పంచాయతీ పరిధిలో  కోవిడ్ బారినపడిన 60 మందికి, తంటికొండ లో నలుగురికి డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, స్నాక్స్ గ్రామ సర్పంచ్ చీడి శివ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. బాదం పప్పు, జీడిపప్పు,  ఖర్జూరం, ఎండి ద్రాక్ష , తేనె , మామిడి  పండ్లు, అరటి పళ్ళు ,  కిట్లుగా తయారు చేసి ఐదు రోజులు మెనూ అందజేయడం జరిగింది.వాతంగి, లోదొడ్డి పంచాయతీల పరిధిలో  కోవిడ్ బారినపడిన పేషెంట్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాతంగి, లోదొడ్డి, వంచంగి, మారేడుబాక పంచాయతీ లపరిధిలో  కోవిడ్ పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మనోహర్ రాజు తెలిపారు. డైట్ తో పాటు ప్రతి ఒక్కరు  ప్రాణామాయం చేయాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  కరోనా బారినుండి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  సర్పంచ్ లు గొల్లపూడి రమణి, శివ,  పెద్దిరాజు లు ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపడుతున్న మనోహర్ రాజును అభినందించారు.ఈ కార్యక్రమంలో గొల్లపూడి పెద్దిరాజు, అధికారి సత్యనారాయణ, దేవతయ్య  వార్డెన్, మంతెన ముసలయ్య,  కోటాసాల్మన్ రాజు, డి ఎల్ రాజు,పంచాయతీ కార్యదర్శి నూకరాజు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు