ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రూ.1కే పెట్రోలు : ఎగబడిన జనం

ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌

రూపాయికే లీటరు పెట్రోలు, బారులు తీరిన జనం

1200 మందికి ప్రయోజనం

ముంబై, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్:

మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వారికి వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్రలోని, శివసేన పార్టీ వాహనదారులకు ఈ తీపి కబురు అందించారు. డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు.

మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన అభిమానులు లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు. డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ను పంపిణీ చేశారు.
లాక్‌డౌన్‌ ఆంక్షలతో ప్రయాణికులు తమ సొంత వాహనాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వీరిపై రోజుకు సుమారు 400 రూపాయల భారం పడుతోదని శివసేన స్థానిక దీపేశ్ మత్రే చెప్పారు. మొదటి 500 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని తెలిపారు. కాగా ముంబైలో లీటరుకు రూ. 102.58, డీజిల్‌ రూ. 94.70 పలుకుతున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు