ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

చేగువీరా స్ఫూర్తి తో యువత సేవాదృక్పదం కలిగి ఉండాలి.

చేగువేర స్ఫూర్తి తో యువత సేవాదృక్పదం కలిగి ఉండాలి.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
చేగువేరా స్ఫూర్తి తో  యువత సేవా భావం కలిగి ఉండాలని కొండపల్లి,చికిలింత సర్పంచ్ లు కుంజం జగన్నాధం, కొండ్ల. సూరిబాబు,డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు టి.శ్రీను పిలుపునిచ్చారు. సోమవారం చేగువీరా జయంతి సందర్భం గా డి.వై.ఎఫ్. ఐ రాజవమ్మంగి మండల కమిటీ అద్వర్యం లో రాజవమ్మంగి లో స్థానిక క్వాటర్స్ వద్దగల  కార్యాలయం లో చెగువీర జయంతి జరిగింది. ముందుగా కొండపల్లి,చికిలింత  సర్పంచ్ లు  కె. జగన్నాధం,కె.సూరిబాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.  ఈ సందర్భం గా  కుంజం జగన్నాధం, కె. సూరిబాబు,టి.శ్రీను మాట్లాడుతూ  చేగువీరా  1920 జూన్ 14 న అర్జనటీనా లో జన్మించి ,వైద్య విద్య కొరకు క్యూభా వెళ్లి అక్కడ జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆ దేశాన్ని బ్రిటీష్ బానిసత్వం నుండి విముక్తి చేసాడన్నారు. అనంతరం విద్య,వైద్యం,ఆర్దికం,న్యాయ వంటి అనేక మంత్రి పదవులలో బాధ్యతలు చేపట్టడని,అక్కడినుండి బొలీవియా లో జరుగుతున్న స్వతంత్ర పోరాటం లో పాల్గొని అమెరికా సైన్యం చేతిలో మరణించాడని అన్నారు. చేగువీరా నిరంతరం దోపిడీ,పీడనకు వ్యతిరేకంగా పోరాడాడని, ప్రజల పై అపారమైన ప్రేమ ,సేవబవం కలిగి ఉండేవాడిని అన్నారు. చేగువీరా నిర్మించిన క్యూభా దేశం నేడు ప్రపంచానికి వైద్యులను అందిస్తుందని ,ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనను ఎదుర్కొనేందుకు క్యూభా వైద్యులు వేళ్ళని దేశం లేదని అన్నారు.  ప్రపంచానికి విద్యా ,వైద్యం ,వంటి అనేకరంగాలలో  ప్రత్యామ్నాయం గా ఉందని అన్నారు. నేటి యువత చేగువీరా బాటలో పాయనించాలని అన్నారు. నేటి పెట్టుబడిదారీ విధానం యువతను  నిరుద్యోగం లోకి నెట్టుతుందని,చెడు వ్యసనాలకు బానిసలను చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో డి.వై.ఎఫ్. ఐ నాయకులు లద్దేపు,సూర్య,త్రిసు చిన్నా ,గిరిజనసంఘం నాయకులు ,ఎస్.ఎఫ్.ఐ నాయకులు గణేష్,నాని,అల్లూరిసీతారమరాజు టైలరింగ్ యూనియన్ అధ్యక్షులు సాంబశివరావు, ఎలక్ట్రానిక్ యూనియం అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు