ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రజల హృదయాలలో నిలిచిపోతారు.

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

ఫ్రంట్ లైన్ వారియర్స్ జనం హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని, కరోనా విపత్కర సమయంలో ముందుండి సేవలందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, ఫారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు వ్రాసిన లేఖలను మండల కేంద్రమైన రాయవరం సచివాలయ, పిహెచ్ సి లో ను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పత్రాలను అందజేశారు. ఈ సంధర్బంగా నాయకులు మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో ముందుండి ప్రజలకు అందించిన సేవలు ఆదర్శనీయమని, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వారు.. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈఫ్రంట్ లైన్ వారియర్స్​కు లేఖలను సుమారు 50 మందికి తెలుగుదేశంపార్టీ నాయకులు ద్వారా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో నూలు సత్యనారాయణ, చాల్లా సత్యనారాయణ, వల్లూరి శ్రీను,మూర్తినీడి శ్రీనివాస్, ఉండవిల్లి శ్రీనివాస్, సందీప్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు