ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

27.3 C
Kākināda
సోమవారం, జూలై 26, 2021

గిరిజన రైతుల సంక్షేమమే జగనన్న లక్ష్యం – ఎమ్మెల్యే ధనలక్ష్మి

గిరిజన రైతుల సంక్షేమమే జగనన్న లక్ష్యం – ఎమ్మెల్యే ధనలక్ష్మి

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

<span;>విశ్వం వాయిస్ న్యూస్ రాజవొమ్మంగి:
<span;>వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. బుధవారం  మండల కేంద్రమైన   రాజవొమ్మంగి  రైతు భరోసా కేంద్రం వద్ద తొంభై శాతం సబ్సిడీపై రైతులకు  విత్తనాలు పంపిణీ చేసే  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిందని జగన్మోహన్ రెడ్డి గారిని రెండు ముద్దు పేర్లతో  పిలవడంజరుగుతుందని ఒకటి రైతు పక్షపాతి,రెండు మహిళా పక్షపాతి అన్నారు. రైతే రాజు. రైతు దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం ఇంతలా ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైయస్సార్ ప్రభుత్వమేన నన్నారు. పంటలు పండించే రైతు సరైన ప్రోత్సాహం లేక పురుగుల మందు తాగి  ఆత్మహత్య చేసుకోవడం జరిగేదన్నారు. మన ప్రభుత్వం వచ్చినా తొలి ఏడాది నుండే రైతన్నలకు తొంభై శాతం  సబ్సిడీ ప్రభుత్వం భరించి  రైతన్నలకు విత్తనాలు అందజేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో యాభై శాతం ఐ టి డి ఎ,నలభై శాతం ప్రభుత్వం భరించేవన్నారు. ఇప్పుడు ఐ టి డి ఎ యాభై శాతం సబ్సిడీ భరించక పోవడంతో మన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి ల విజ్ఞప్తి మేరకు ఏజెన్సీలో తొంభై సబ్సిడీ పై గిరిజనులకు  విత్తనాలు అందించే కార్యక్రమం చేపట్టారన్నారు. అమర పన్నెండు వందల అరవై ఉండగా సబ్సిడీపై 115,  శ్రీ ధృతి 114, నెల్లూరు సన్నా లు 99 రూపాయలకు గిరిజనులకు ఇవ్వడం జరుగుతుందన్నారు.  గిరిజనేతరులకు ఐదు శాతం సబ్సిడీపై  విత్తనాలు అందజేయడం  జరుగుతుందన్నారు. గతంలో విత్తనాల కోసం రైతులు మండల కేంద్రాల చుట్టూ నాలుగైదు రోజులు తిరిగి వ్యయ ప్రయాసలతో  విత్తనాలు  పొందే వారన్నారు.  ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడే రైతు భరోసా కేంద్రం నెలకొల్పి అందరికీ అందుబాటులో ఉండేలా విత్తనాలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. ఈ అవకాశాన్ని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా  ఆమె  కోరారు.  మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలను అందుబాటులో తేవడం జరిగిందన్నారు. మండలంలో 280 మంది వాలంటీర్లను నియమించి  నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలకతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు  పార్టీలు నిమిత్తం లేకుండానేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఒడి, వాహన మిత్ర, చేయూత తదితర వి పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంత బాబు జగన్  మోహన్ రెడ్డిదృష్టికి తీసుకెళ్లి   సెల్ఫ్డెకరేషన్ ద్వారా గడువు పెంచడం జరిగింది అన్నారు. అగ్రికల్చర్  ఏడి మాట్లాడు తూ మండలంలో4 రైతు భరోసా  కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కేంద్రాలకు రైతులు వచ్చి మరింత సమాచారాన్ని తెలుసుకొని ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు. ఏవో అశోక్ కుమార్ మాట్లాడు పిఎం కిసాన్ ద్వారా గతేడాది రైతుకు అకౌంట్లో 13500,  ఈ ఏడాది మే లో 5500  ప్రభుత్వంవేయడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా మండలంలో నాలుగువేల 3 వందల మంది రైతులకు ఐదు కోట్ల 80 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. 90 శాతం సబ్సిడీపై 10 50 క్వింటాళ్లు రిజిస్ట్రేషన్  చేసుకున్న రైతులకు  విత్తనాలు అందజేయడం జరుగుతుందన్నారు. గతేడాది 750  క్వింటాళ్లు విత్తనాలు  అందచేయడం జరిగిందన్నారు.రైతులకు మండలంలో ఏడు చోట్ల విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.అనంతరం  ఎమ్మెల్యే చేతులమీదుగా విత్తనాల కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు విత్తనాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బొడ్డు వెంకట రమణ,  దాట్ల వెంకటేశ్వర రాజు,ఎం ఎం ఎస్ లీడర్  గోము వెంకటలక్ష్మి,మండల  సర్పంచుల సమైక్య  అధ్యక్షులు  కొంగర మురళీకృష్ణ, మాజీ సొసైటీ అధ్యక్షులు గణజాల తాతారావు, మాజీ సర్పంచ్ సిహెచ్ అప్పారావు,  వ్యవసాయ సలహామండలి సభ్యురాలు సిహెచ్ శాంత కుమారి, జడ్పిటిసి అభ్యర్థి వి. జ్యోతి, నాగులపల్లి కుసరాజు, సిహెచ్ ప్రసాద్,అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు,  గిరిజన రైతులు,కార్యకర్తలు,  అభిమానులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు