ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

– బుట్టాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు
– విద్యుత్ శాఖ ఏఈ వెంకట్రావు నేతృత్వంలో పనులు

ఎటపాక, విశ్వం వాయిస్ న్యూస్:

ప్రతీయేటా వచ్చే గోదావరి వరదలతో ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం వల్ల మండల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎటపాక మండలంలోని బుట్టాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న నెల్లిపాక , తోటపల్లి , లక్ష్మీపురం తదితర గ్రామాలకు వెళ్లే విద్యుత్ సరఫరాలో గోదావరి వరద తాకిడి పెరగగానే ముందుగా విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. దీంతో సమస్యను గుర్తించిన విద్యుత్ శాఖాధికారులు గోదావరి వరదలకు ముందే అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నెల్లిపాక విద్యుత్ శాఖ ఏఈ వెంకట్రావు నేతృత్వంలో సిబ్బంది బుట్టాయిగూడెం సబ్ స్టేషన్ నుండి ఆయా గ్రామాలకు 11 కెవి సరఫరా కోసం ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన 45 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అలాగే విలీన మండలాలకు నెల్లిపాక , తోటపల్లి మీదుగా విద్యుత్ సరఫరా జరుగుతున్న 33 కెవి లైన్ కూడా వరదలకు త్వరగా నీట మునుగుతున్న నేపథ్యంలో యేటా విలీన మండలాల్లోని గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి. దీంతో 33 కెవి విద్యుత్ లైన్ సరఫరాకు కూడా ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖాధికారులు ముందస్తుచర్యలు చేపట్టారు. 33 కెవి విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం నూతనంగా 10 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు నెల్లిపాక ఏఈ వెంకట్రావు , లైన్ మెన్ శ్రీనివాస్ , అసిస్టెంట్ లైన్ మెన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిబ్బందితో జరుగుతున్నాయి.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు