ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మహిళా భద్రతకు పెద్దపీట – దిశా యాప్ తోనే సాధ్యం

మహిళా భద్రతకు పెద్ద పీట – వారి పట్ల హింసకు అడ్డుకట్ట
– ప్రతీ మహిళా డౌన్లోడ్ చేసుకోండి నేడే దిశా యాప్ ను
– బటన్ నొక్కితే చాలు మహిళలకు అండగా పోలీస్
– ఎటపాకలో దిశా యాప్ గురించి ప్రచార కార్యక్రమం

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దిశా యాప్ ను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ వద్ద ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో దిశా యాప్‌ని ప్రతీ మహిళా డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే ఆయా గ్రామాల్లోని మహిళలకు అవగాహన కల్పించేందుకు ఎటపాక పోలీసులు మొదటిగా మండల కేంద్రంలో దిశా యాప్ గురించి ప్రచారం మొదలుపెట్టారు. దిశ యాప్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎటపాక సీఐ ఎం.గజేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఎస్సై జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు దిశా యాప్ పై ఎటపాకలోని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఎం.గజేంద్రకుమార్ మాట్లాడుతూ మహిళల భద్రతకు దిశ యాప్ ఒక‌ కవచంలా ఉపయోగపడుతుందని , మహిళలు , బాలికలు వారి వారి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ దిశా యాప్ ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరియు మండలాల్లో ఉన్న అన్ని సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు మరియు గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో మహిళలకు , బాలికలకు దిశ చట్టం మరియు దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వెయ్యడానికి ప్రయోగించే సాధనమైన దిశ యాప్ ని గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మహిళా పోలీసులు , వాలంటీర్లు ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తూ , ఆపద సమయాల్లో మహిళలు దిశ యాప్ ఉపయోగించడం ద్వారా వారిని కాపాడేందుకు పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మహిళా పోలీసులు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఎస్సై జ్వాలాసాగర్ మరియు సచివాలయాల మహిళా పోలీసులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు