ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

నేనేమి పాపం చేశాను ఇంతలా వేధిస్తున్నారు…

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

నేనేమీ పాపం చేశాను ఇంతలా వేధిస్తున్నారంటూ నదురుబాధ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. మండలంలోని నదురుబాధ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న విత్తనాల ముత్యాలరావు ను అదే గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాస్ వేధింపులు తట్టుకోలేక పోతున్నట్లు ఆరోపిస్తూ బుధవారం తన గృహంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నేనేమి పాపం చేసానని ఇంతలా వేధిస్తున్నారంటూ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు. దళితుడు అనే చిన్న చూపుతో నన్ను వేధిస్తున్న రా అంటూ వాపోయారు. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నా మీద ఎంక్వైరీ వేయించి నా మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీనివాస్ రావు ప్రవహిస్తున్నట్లు తెలిపారు. వీడియో కొనసాగుతుండగానే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు ముత్యాలరావు ను హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ముత్యాలరావు కు భార్య అనంతలక్ష్మి , ఇద్దరు పిల్లలు అజయ్ ప్రణతి ఉన్నారు. కాగా దీనిపై పోలీసులను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే రాయవరం పోలీసులను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ ను జరిగిన విషయాలను అడిగి తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు