ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోం……

– పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
– బిజెపి రాష్ట్రనాయకులు ఉమామహేశ్వరావు

– గన్నవరం గ్రామంలో విలేకరులతో సమావేశం

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

అఖిలపక్ష నాయకులు విలీన మండలాల పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఇటువంటి విధానం అఖిల పక్ష నాయకులకు సమంజసం కాదని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్రనాయకులు ఉమామహేశ్వరరావు , గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణారావు పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని గన్నవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన విలేకర్ల సమావేశంలో వారిరువురు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని , రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయకుండా కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిందని అన్నారు. విలీన మండలాలైన విఆర్ పురం, కూనవరం, ఎటపాక ,చింతూరు మండలాలు ప్రాజెక్టు నిర్మాణం వల్ల పుర్తిగా జల సమాధి కానున్నాయి. నిర్వాసితుల త్యాగాల ఫలితమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమని , నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అవసరమైతే ప్రధాని మోదీ దృష్టికి విలీనమండలాల సమస్యలను తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రస్తుతం విలీన మండలాల ప్రజలు అయోమయంలో ఉన్నారని అధికారులు పూర్తి స్థాయిలో నిర్వాసితులకు సమాచారం ఇవ్వడం లేదని , దీనితో విలీన మండలాల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ,పునరావాసం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని వారు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎటపాక బిజెపి అధ్యక్షుడు మోదుగు పెరమయ్య , అరకు జిల్లా నాయకులు బొల్లా.ప్రసాద్ , కొరకాసుల.రామకృష్ణ , గంధం.జయమ్మ , మోదుగు.చిన్ని పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు