ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

నిర్వాసితులకు తెదేపా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

– పరిహారం చెల్లించి పోలవరం నిర్వాసితులను తరలించాలి.
– నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాటం చేస్తుంది.
– నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరం జాతీయ ప్రాజెక్టు
– పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు
– నిర్లక్ష్య వైఖరి వీడి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
– తెదేపా పార్టీ రాష్ట్ర నాయకులు జ్యోతుల.నెహ్రూ

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

పోలవరం నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెదేపా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు. ముంపు మండలాల పర్యటనలో భాగంగా శనివారం ఎటపాక మండల కేంద్రానికి విచ్చేసిన తెదేపా రాష్ట్ర నాయకులు జ్యోతుల.నెహ్రూ , రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల.రాజేశ్వరిదేవిని తెదేపా మండలాధ్యక్షులు మువ్వ.శ్రీనివాస్ నేతృత్వంలో తెదేపా పార్టీ సీనియర్ నాయకులు పాటి.చలపతి ఇంటి వద్ద ముఖ్య కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెదేపా రాష్ట్ర నాయకులు జ్యోతుల.నెహ్రూ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు తెదేపా అండగా ఉంటుందని , నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నిర్వాసితుల త్యాగ ఫలితమే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణమని , అలాంటి త్యాగం చేసిన ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించకుండా , నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టారని , ఇప్పటికే పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా కొన్ని గ్రామాల్లో నీరు చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పూర్తి స్థాయిలో సర్వే ప్రారంభించి , ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించాలని ఆయన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల.రాజేశ్వరి మాట్లాడుతూ తెదేపా పార్టీ అధికారంలో వున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో పరిహారం చెల్లించిందని , వైకాపా ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా ప్రజలను తరలించాలని చూస్తున్నారని , నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే వారిని తరలించాలని , పోలవరం ప్రాజెక్టుకు తెదేపా పార్టీ వ్యతిరేకం కాదని , నిర్వాసితులకు న్యాయం జరిగేలా చేయడమే తమ పార్టీ ఉద్దేశ్యమని , దాని కోసం అవసరమైతే దీక్షలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ మండలాధ్యక్షుడు మువ్వ.శ్రీనివాస్ , తెదేపా పార్టీ సీనియర్ నాయకులు పాటి.చలపతి , ఎటపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ కారం.వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకులు చేకూరి.సత్యనారాయణ , పురుషోత్తపట్నం గ్రామకమిటీ అధ్యక్షులు చేకూరి.వెంకటరమేష్ (కొండ) , తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని.చందు , తెదేపా నాయకులు అర్జనాయక్ , మాజీ జెడ్పీటీసీ గోడేటి.రవికుమార్ , ఎటపాక తెదేపా నాయకులు మువ్వ.రాము , దుద్దుకూరి.రాము , పాటి.సంపత్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు