ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

దిశ చట్టం పై మహిళలకు అవగాహన కల్పించిన ఎస్ ఐ గోపి  నరేంద్ర ప్రసాద్

దిశ చట్టం పై మహిళలకు అవగాహన కల్పించిన ఎస్ ఐ గోపి  నరేంద్ర ప్రసాద్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

దిశ చట్టం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాజవొమ్మంగి ఎస్ఐ గోపి నరేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక గ్రామ సచివాలయం వద్ద మంగళవారం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ప్రతి మహిళ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని వారు ఉంటున్న లోకేషన్ షేర్ చేయడం వల్ల దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో గానీ, ప్రభుత్వ కార్యాలయంలో గానీ లొకేషన్ షేర్  అవ్వడం వల్ల ఆపదలో ఉన్న మహిళను గుర్తించి రక్షించడం  జరుగుతుందన్నారు. దిశ చట్టం మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు చట్టం గురించి తెలుసుకొని ఉపయోగించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ భుజంగరావు, పోలీస్ సిబ్బంది,  మహిళా పోలీసులు, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు