ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రైతు(దగా) దినోత్సవం

రైతులను ఆదుకోలేని జగన్ సర్కార్

రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఆరోపించిన  మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి

అనపర్తి, విశ్వం వాయిస్ న్యూస్:

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని
వైస్సార్ సీపీ తలపెట్టిన రైతు దినోత్సవం కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తన స్వగృహం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు తో కలసి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని ఇది “రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవం” అంటూ ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ వైస్సార్ సీపీ అధికారం చేపట్టిన ఈ రెండు సంవత్సరాలుగా రైతులు పూర్తిగా అన్యాయం అయిపోయారని ఆరోపించారు.నష్టపరిహారం, మద్దతు ధర కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడిందని. అలాగే రైతులకు అందించాల్సిన ఎరువులు,విత్తనాలు,సాగు నీరు విషయం లో ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు.వైస్సార్ సీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తుందని దానికి ఉదాహరణగా ప్రపంచ రైతు దినోత్సవం రోజున జరుపుకోవాల్సిన రైతు దినోత్సవాన్ని జగన్ యొక్క స్వార్ధం కారణంగా వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున జరపడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున వ్యతిరేకించారు.గత రెండు నెలలుగా ధాన్యం బకాయిలు పేరుకుపోయాయని ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 800 వందల కోట్లు బకాయిలు ఉన్నాయని అవి తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఖరీఫ్ కి రైతాంగం సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి కావలసినవి అందించలేని పరిస్థితి లో ప్రభుత్వం ఉందని.దీనిని నిరసిస్తూ “రైతు దినోత్సవం కాదు రైతు దగా దినోత్సవం” అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు,రాజమహేంద్రవరం పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవిందు,అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, జడ్పీటీసీ అభ్యర్థి శేషారత్నం, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, బిక్కవోలు జడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు,రంగంపేట మండల పార్టీ అధ్యక్షులు సత్తిబాబు, పెదపూడి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, అనపర్తి మండల తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ అధికార ప్రతినిధులు వెంకటరామరెడ్డి,సోమరాజు,రాజమహేంద్రవరం పార్లమెంట్ కార్యదర్శి బుజ్జి, మాజీ సర్పంచ్ అప్పలస్వామి,వెంకన్నదొర, బుల్లిదొర, సత్తిబాబు, శ్రీను, కాటన్, కుమార్,దోసారెడ్డి, బసివిరెడ్డి,వీర భాస్కర్ రెడ్డి,వెంకన్నబాబు,జోషిబాబు, మండల & గ్రామ నాయకులు పాల్గోన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు