ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

జనశేఖరునికి చోడవరంలో ఘన నివాళులు

జనశేఖరునికి వైకాపా శ్రేణుల ఘన నివాళులు
– మండలంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.
– ఘనంగా నివాళులర్పించిన వైకాపా శ్రేణులు

 

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దివంగత మహానేత , రైతు భాందవుడు , మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలను వైకాపా నాయకులు మండలంలో ఘనంగా నిర్వహించారు. మహానేత జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8వ తేదీని వైఎస్సార్ రైతు దినోత్సవంగా జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎటపాక మండల పరిధిలోని చోడవరం , రాజుపేట , పురుషోత్తపట్నం , రాయనపేట , నెల్లిపాక , తోటపల్లి తదితర గ్రామపంచాయతీల్లోని రైతులు , మండల వైకాపా నాయకులు వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు , చిత్ర పటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి , వృద్దులకు , వితంతువులు , వికలాంగులకు మిఠాయిలను పంచి పెట్టారు. ఎటపాక గ్రామసచివాలయం , టిపి.వీడు గ్రామసచివాలయం , రాజుపేట రైతు భరోసా కేంద్రం వద్ద జిల్లా , మండల వైకాపా నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చోడవరం ఎంపిటిసి , వైకాపా నాయకులు ఎలమోలు.రమేష్ , ఉప సర్పంచ్ ఏపూరి.విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ద్వారా అదే జాబితాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి రహిత రాజన్న పాలన అందిస్తున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం సర్పంచ్ పొడియం.మణి , వైకాపా నాయకులు పోడియం.నాగేశ్వరరావు , రవి తదితరులు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు