ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

పురుషోత్తపట్నంలో వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు

పురుషోత్తపట్నంలో వైఎస్సార్ 72వ జయంతి వేడుకలు.
– నివాళులర్పించిన గ్రామంలోని వైకాపా శ్రేణులు
– సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ నేతృత్వంలో

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దివంగత మహానేత , రైతు భాందవుడు , మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలను వైకాపా నాయకులు మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. మహానేత జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8వ తేదీని వైఎస్సార్ రైతు దినోత్సవంగా జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎటపాక మండల పరిధిలోని పురుషోత్తపట్నం గ్రామపంచాయతీలోని రైతులు , గ్రామ వైకాపా నాయకులు ప్రధాన కూడలిలోని వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వై.ఎస్.ఆర్.జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి , వృద్దులకు , వితంతువులు , వికలాంగులకు మిఠాయిలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్దా.ఆదినారాయణ మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ద్వారా అదే జాబితాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి రహిత రాజన్న పాలన అందిస్తున్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తపట్నం ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి , వైకాపా సీనియర్ మహిళా నాయకురాలు దామెర్ల.రేవతి , వీరారెడ్డి , జయచంద్రారెడ్డి , జిమ్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు