ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

నందిగామలో ఘనంగా వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు

మహానేత వై.ఎస్.ఆర్ కు ఘనంగా నివాళులు
– నందిగామలో ఘనంగా వై.ఎస్.ఆర్ 72వ జయంతి వేడుకలు
– సర్పంచ్ బేబీ , సొసైటీ చైర్మన్ ఆకుల.వెంకటరామారావు నేతృత్వంలో

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

దివంగత మహానేత , మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి సందర్భంగా ఎటపాక మండలం నందిగామ గ్రామపంచాయితీలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి నందిగామ సర్పంచ్ ఇంగులపు బేబీ , ఎటపాక సొసైటీ చైర్మన్ ఆకుల.వెంకటరామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోడపర్తి.చిన్న నాగయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ప్రజల ఆశాజ్యోతిగా నిలిచిపోయారని అన్నారు. రైతన్నలకు రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం నందిగామ టిడిపి 4వ వార్డు సభ్యురాలు కొంగ మేరీని గ్రామ సర్పంచ్ ఇంగిలపు బేబీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చండ్ర కృష్ణార్జునరావు , యల్లంకి.కొండబాబు , పులుసు.కొండలరావు , యాలం.సీతారామయ్య , గోడపర్తి.కిట్టయ్య , సురేందర్ , చిలకాల.నరసింహారావు , ముప్పాల.రమేష్ , ముప్పాల.సునీత , నాయకులు వైఎస్సార్ అభిమానులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు