ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

గడ్డి మందు తాగిన గిరిజన యువతి మృతి పై కేసు నమోదు- ఎస్ ఐ రాజేష్

గడ్డి మందు తాగిన గిరిజన యువతి మృతి పై కేసు నమోదు- ఎస్ ఐ రాజేష్

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

గడ్డిమందు  తాగి కాకినాడలో వైద్యం పొందుతూ మృతి చెందిన గిరిజన యువతి మృతిపై కేసు నమోదు చేసినట్లు  జడ్డంగి సబ్ ఇన్స్పెక్టర్ లంకా రాజేష్  తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వంచంగి పంచాయతీ రత్నాల పేటకు చెందిన గిరిజన యువతి సుర్లలోవమ్మ(24) మారేడుబాక గ్రామానికి చెందిన  చిట్టోజు రవి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి వ్యవహారం గ్రామపెద్దల వరకు వెళ్ళింది. కాగా లోవమ్మ ఐదు నెలల గర్భవతన్న విషయం తండ్రికి తెలియడంతో మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన  లోవమ్మ  ఈ నెల 10 న ఉదయం గడ్డి మందు  తాగడంతో తమ అక్క కుడే నూకరత్నం  ఏలేశ్వరం సి హెచ్ సి కి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ  జిజిహెచ్ కు తరలించగా అక్కడ వైద్యం పొందుతూ ఆదివారం మృతి చెందగా సాయంత్రం  వచ్చిన మరణ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు  ఎస్ఐ తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు