ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

మానవత్వం చాటుకున్న స్నేహ హస్తాలు ఫౌండేషన్

ప్రభుత్వ ఆసుపత్రికి కాన్సంట్రేటర్ , మాస్కులు అందజేత
– చింతూరు ఐటిడిఎ పిఓ వెంకటరమణ చేతుల మీదుగా
– అమెరికాకు చెందిన స్నేహ హస్తాలు ఫౌండేషన్ సహకారంతో

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

కరోనా వైరస్ సోకి ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ఇబ్బంది పడుతున్న వారికోసం ఆక్సిజన్ అందేలా ఉపయోగించే 90 వేలు విలువ గల 7 లీటర్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మరియు 10 వేలు విలువైన ఎన్ 95 మాస్కులు , సర్జికల్ మాస్కులను అమెరికాకు చెందిన స్నేహ హస్తాలు ఫౌండేషన్ వారు సోమవారం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి వితరణగా అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు నలజాల.శంకర్ రావు , ఎటపాక మండలం నెల్లిపాక సర్పంచ్ కోర్స.భద్రమ్మ మరియు వార్డు సభ్యులు చింతూరు ఐటిడిఎ పిఓ ఆకుల.వెంకటరమణ చేతుల మీదుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఆసుపత్రికి వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు నలజాల.శంకర్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్నేహ హస్తాలు ఫౌండేషన్ ద్వారా విలీన మండలాల్లో ఉన్న ప్రజలకు వైద్య ,విద్య మొదలగు సామాజిక సేవ కార్యక్రమాలు అందించటానికి ముందుంటుందని తెలిపారు. కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అందేలా చూడాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊకె.వెంకటమ్మ , పుట్టి.రమేష్ , గద్దల.ప్రియాంక మరియు ముదిగొండ.సునీత , వినయ్ కుమార్ , చింతూరు మండల తెలుగు యువత కార్యదర్శి ఎండీ.రియాజ్ పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు