ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను అమలు
జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

జిల్లాలో ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు రాత్రి 10 గంట‌ల నుంచి ఉదయం 6 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌లుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జీవోఆర్‌టీ నెం.371ను వెలువ‌రించినందున కోవిడ్ నియంత్రణ, అత్యవసర సేవల కోసం అనుమతించిన వ్యక్తులు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరూ బహిరంగ ప్రదేశాలలో సంచరించరాదని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఫార్మశీలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, అత్యవసర సేవ‌లు అందించే సంస్థలు మినహా కర్ఫ్యూ వేళల్లో షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కార్యాల‌యాలు, రెస్టారెంట్లు త‌దిత‌రాలు రాత్రి 10 గంటలకు విధిగా మూసివేయాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా కర్ఫ్యూ సడలింపు సమయాల్లో కూడా జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బహిరంగ ప్రదేశాల్లో అయిదుగురుకు మించి వ్యక్తులు గుమికూడ‌టం నిషేధ‌మ‌ని తెలియజేశారు. ఈ ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా, డివిజనల్, మండల, గ్రామ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం, 2005లోని సెక్ష‌న్ 51-60, ఐపీసీ సెక్ష‌న్ 188, ఇత‌ర వ‌ర్తించే చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు