ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

గ్రామసేవకు సై అంటున్న అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్

గ్రామసేవకు సై అంటున్న అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్
– కోవిడ్ బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
– రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి మరింతగా తోడ్పతాం
– హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు దాసరి.పెదబాబు వెల్లడి

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

రానున్న రోజుల్లో రాయనపేట గ్రామాభివృద్ధికి మరింతగా తోడ్పతామని అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు దాసరి.పెదబాబు పేర్కొన్నారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకొనేందుకు కొంతైనా సహాయ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షుడు దాసరి.పెదబాబు , ఉపాధ్యక్షుడు చిన్నం.షాలేం రాజా తెలిపారు. ఈ సందర్భంగా కరోనా వచ్చి ఇళ్లకే పరిమితమై ఐసోలేషన్ లో ఉన్న వారికి అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం వారి ఇండ్ల వద్దకే యూత్ సభ్యులు వెళ్లి నిత్యావసర వస్తువులు వితరణగా అందజేశారు. అనంతరం వారిరువురు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతీఒక్కరూ స్వీయరక్షణ పాటించాలని , తప్పనిసరిగా మాస్క్ ధరించాలని , సామాజికదూరం పాటిస్తూ , శానిటైజర్ ఉపయోగించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. 45 సంవత్సరాలు నిండిన వారందరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా జలుబు , జ్వరం , ఒళ్ళు నొప్పులు లాంటి కోవిడ్ లక్షణాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని , పౌష్టికాహారం తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు గ్రామస్తులకు సూచించారు. తెలిపారు. రాయనపేట గ్రామపంచాయతీలో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు అంబేద్కర్ హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం.బాబు , ఎల్.బాబు , గోలి.శ్రీనివాస్ , గోలి.సురేష్ , బుయ్యన.కిరణ్ , దాసరి.వంశీ , ఎం.ఆనంద్ , డి.హరినాథ్ , పి.సాయి కిరణ్ , జి.చంటి , ఎం.పుల్లారావు , జి.ప్రవీణ్ , ఎం.పురుషోత్తం , ఎల్.రవి , జి.గణేష్ , ఎం.ప్రసాద్ , బి.శరత్ , ఎం.మధుబాబు , జి.రఘువరణ్ , పి.వీరబాబు , పి.రాజ్ కుమార్ , జి.గంగాధర్ , జి.సతీష్ , ఎం.శ్రీకాంత్ , పి.శేఖర్ , డి.వాసు , పి.మనోజ్ కుమార్ , కె.వీరబాబు , పి.రామకృష్ణ , పి.నరేంద్ర , కె.ప్రశాంత్ , డి.వెంకటేష్ , కె.పవన్ , పి.పున్నయ్య , జి.శ్రీనివాస్ , ఇ.నవీన్ , పి.బాబు , డి.సందీప్ , జి.బాలు , డి.రమణ, పి.రమణ మరియు రాయనపేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు