ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

35 లక్షల విలువైన గంజాయి,వాహనం స్వాధీనం. ఎస్.ఐ విద్యాసాగర్.

35 లక్షల విలువైన గంజాయి,వాహనం స్వాధీనం.

పాడేరు అటవీప్రాంతం నుండి రాజమండ్రి మీదుగా హైదరాబాదు కు తరలింపు.

 

ఏలేశ్వరం, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖ ద్వారమైన ఏలేశ్వరంలో 1500 కేజీల గంజాయి పట్టుబడింది.

వివరాల్లోకి వెళ్తే  గంజాయి రవాణా అవుతుందన్న పక్కా సమాచారం మేరకు ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే దారిలో సత్తమ్మ తల్లి గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐసర్ వ్యాన్ లో ఒక్కొక్కటీ 30 కేజీల చొప్పున 50 బ్యాగులు పట్టుబడ్డాయి.హైదరాబాద్ కు చెందిన రవి అనే వ్యక్తి డ్రైవర్ ను ఏర్పాటు చేసుకొని పాడేరు అటవీ ప్రాంతం నుండి రాజమండ్రి మీదుగా హైదరాబాద్ తీసుకువెళ్లాడానికి ప్రయత్నిస్తుండగా వీరు పట్టుబడ్డారు.వీరికి గంజాయి సరఫరా చేసిన రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కనిగిరి దుర్గా ప్రసాద్,కరణం సూరిబాబు వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో పరారయ్యారు.గంజాయితో ఉన్న వాహనాన్ని, డ్రైవర్ సుమన్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఎస్.ఐ విద్యాసాగర్ తెలిపారు.పట్టుబడ్డ గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందని తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు