ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి…

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

ప్రజలకు క్షయ వ్యాధి నివారణపై అవగాహన అవసరమని పి.హెచ్.సి వైధ్యాదికారి డా. ఎ. దేవిరాజేశ్వరి, ఎస్.టి.ఎస్ మహేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో వెంకటేశ్వరస్వామి గుడి వద్ద టి.బి.వ్యాది లక్షణాలు నివారణ చర్యలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి వైధ్యాదికారి డా. ఎ. దేవిరాజేశ్వరి, ఎస్.టి.ఎస్ మహేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగహన కలిగి ఉండాలని, వ్యాధి లక్షణాలు రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్షయవ్యాధి గ్రస్తులను వెలివేయారదని, వారితో ప్రేమగా మాట్లాడాలని, క్షయ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అత్యాధునికి, నాణ్యమైన మందులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకొని క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. 2030 నాటికి క్షయ రహిత ప్రపంచంగా మార్చాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించుకుందన్నారు. అవగాహణ కల్పిస్తూ అనుమానితిలకు సాంపిల్స్ సేకరించి లేబ్ కి పంపించారు. ఈకార్యక్రమమునకు హేల్త్ ఎడ్యుకేటర్ ఫి.యు.సీతామహలక్ష్మి, హెచ్.ఎ. కె.వెంకటెశ్వరరావు, ఎ.ఎన్.ఎం అనురాధ, ఆషా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు