ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలరావు కు మాల మహానాడు అండగా ఉంటుంది… రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్

రాయవరం,విశ్వం వాయిస్ న్యూస్:

ఫీల్డ్ అసిస్టెంట్ సొంతంగా గృహాన్ని నిర్మించుకుని కుటుంబంతో ఆనందంగా జీవించడం తప్ప అంటూ రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలో నదురుబాధ గ్రామంలో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావును రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సిరిపురపు శ్రీనివాస రావు వేధింపులకు గురయ్యే ముత్యాలరావు ఆత్మహత్యాయత్నానికి వడి కట్టడాన్ని చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు. ఈ విషయంపై రామచంద్రపురం డిఎస్పి డి బాలచంద్రారెడ్డి ని కలిసి సిరిపురపు శ్రీనివాసరావు ని ఎందుకు అరెస్టు చేయలేదని అడుగగా డి.ఎస్.పి రెండు మూడు రోజులలో శ్రీనివాసరావును అరెస్టు చేస్తామని తెలిపినట్లు ఆయన తెలియజేశారు. ముత్యాలరావు కు న్యాయం జరగకపోతే మాల మహానాడు నాయకులంతా జిల్లా ఎస్పీని కలిసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ముత్యాల రావు కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల దళిత నాయకులు ఉన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు