ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

నష్టం కలిగించే క్వారీని తెరిచే ప్రయత్నాలు మానుకోవాలి.

రాయి క్వారీని తెరిచే ప్రయత్నాలు మానుకోవాలి.
– లేనిపక్షంలో పెద్దయెత్తున ప్రజా ఉద్యమం చేస్తాం
– బిజెపి మండల కార్యదర్శి పెనుబల్లి.శేఖర్ హెచ్చరిక

ఎటపాక, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

గిరిజనులకు నష్టం కలిగించే క్వారీని తెరిచే ప్రయత్నాలు మానుకోవాలని , అటువంటి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని బిజెపి మండల కార్యదర్శి పెనుబల్లి.శేఖర్ అధికారులకు హితవు పలికారు. ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామంలో గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ , ఎస్పీ అద్వర్యంలో మూసివేసిన రాయి క్వారీని కాసులకు కక్కుర్తి పడి కొందరు వ్యక్తులు వారి స్వప్రయోజనాల కోసం తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని బిజెపి నాయకులు శేఖర్ పేర్కొన్నారు. క్వారీ ప్రారంభిస్తే ఎక్కువగా నష్టపోయేది అమాయక గిరిజనులేనని ఆయన మండిపడ్డారు. గిరిజనులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోని రాయి క్వారీని శాశ్వతంగా మూసివేయాలని సూచించారు. గతంలో క్వారీలో బ్లాస్టింగ్ చేయడం వల్ల గిరిజనుల ఇండ్లు , పొలాలకు నష్టం వాటిల్లిందని అదే తరహాలో ప్రస్తుతం గిరిజనులకు నష్టం కలిగించే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని , ఈ విషయంలో ఎంతటి వారైనా సహించేది లేదన్నారు. క్వారీ ప్రారంభించడానికి చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని లేనిపక్షంలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీలోని ప్రజలతో ఉద్యమం చేస్తామని బిజెపి నాయకులు పి.శేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడే.సతీష్ కుమార్ నాయక్ , పెనుబల్లి. సరోజిని , కుంజా.వెంకటేష్ , కుంజా.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు