ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

జగ్గంపేట, విశ్వం వాయిస్ న్యూస్:

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ కాపు నేస్తం రెండో విడత జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి ఒక్క కాపు అక్కాచెల్లెళ్లకు ఈ పథకం వర్తిస్తుందని అక్క చెల్లెమ్మలకు భవిత మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో సంవత్సరం కూడా 15 వేల రూపాయలు వేయడం జరిగిందన్నారు . అదేవిధంగా ఐదు సంవత్సరాల పాటు 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందే విధంగా వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని తీసుకోవడం జరిగిందన్నారు జగ్గంపేట నియోజకవర్గం లోనే గండేపల్లి జగ్గంపేట కిర్లంపూడి గోకవరం మండల కు సంబంధించిన 9 కోట్ల 55 లక్షల 3 5 వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు..ఈ కార్యక్రమంలో బండారు రాజా, జనపరెడ్డి సుబ్బారావు, వామ్మి రఘురాం అత్తులూరి నాగబాబు, బచ్చల నాగరత్నం, కుంచే రాజా, భూపాలపట్నం ప్రసాద్, ఇళ్ల అప్పారావు కాపు, తోట అయ్యన్న, తోట రవి, అల్లు విజయ్ కుమార్, అడబాల ఆంజనేయులు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, జగ్గంపేట ఎస్ ఐ లక్ష్మీకాంతం , ఒబిణ్నివీరబాబు, రాయి సాయి, నాలుగు మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు