ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

10 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

10 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

నిందితులిద్దరూ తెలంగాణా వాసులే.

20వేల విలువైన 10 కేజీల గంజాయి,పల్సర్ బైక్ స్వాధీనం.

 

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

తూర్పుజిల్లాలోని రంపచోడవరం డివిజన్  రాజవొమ్మంగి మండలం  జడ్డంగి గ్రామ శివారు మడేరు వాగు  సమీపంలో  జరిపిన వాహన తనిఖీల్లో ఇరువురు వ్యక్తుల ను అదుపులోకి తీసుకొని  20 వేల విలువైన 10 కేజీల గంజాయి, పల్సర్ మోటార్ బైక్ స్వాధీనం  పరచుకున్న ట్లు  స్థానిక సిఐ ఎం నాగ దుర్గారావు తెలిపారు. జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, రంపచోడవరం  ఏ ఎస్ పి కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు మేరకు స్థానిక సీఐ ఎం నాగ దుర్గారావు పర్యవేక్షణలో ఎస్ ఐ లంకా రాజేష్ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు సిబ్బంది తో వెళ్లి  గ్రామ శివారులోవాహన తనిఖీలు చేపడుతుండగా నర్సీపట్నం నుండి ఏలేశ్వరం  రోడ్డు లో పల్సర్ మోటార్ బైక్  పై ఎర్ర సోల్జర్ బ్యాగులో 10 కేజీలు  గంజాయి రవాణా చేస్తున్న  మేకల శ్రవణ్  కుమార్ , మేకల బిక్షపతి లను అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం, మురుగు జిల్లా, వెంకటాపురం మండలం, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన  శ్రవణ్ కుమార్ , భిక్షపతిలు విశాఖ జిల్లా  సీలేరు గ్రామ అటవీ పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వద్ద గంజాయి కొనుగోలు చేసి తమ  ప్రాంతాల్లో అధిక రేటు కు  విక్రయించడానికి జడ్డంగి మీదుగా తీసుకువెళ్తుండగా పట్టుబడినట్లు ఆయన తెలిపారు. స్థానిక తాసిల్దార్ ,తూకం దారులు, మధ్యవర్తుల సమక్షంలో  10 కేజీలు గంజాయి ,  టీఎస్25సి6721 నలుపు అండ్ బ్లూ రంగు కలిగిన పల్సర్ మోటార్ బైక్, రెండు వేల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీన  పరచుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఈ దాడిలో ఎస్ ఐ లంకా రాజేష్, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ బాబూరావు, సిబ్బంది కే ప్రసన్న  రాజు, వై గంగాధర రావు, కే శ్రీనివాస్ లు ఉన్నారు. గంజాయి స్మగ్లర్లును పట్టుకున్న  పోలీసు సిబ్బందిని ఏ ఎస్ పి కృష్ణకాంత్ పటేల్ అభినందించారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు