ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

రబీ సాగులో అపరాలు వేయాలి- ఏవో అశోక్ కుమార్

రబీ సాగులో అపరాలు వేయాలి.

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలి.

మల్బరీ,చేపల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించాలి.

రాజవొమ్మంగి, విశ్వం వాయిస్ న్యూస్:

ప్రతి రైతు రబీ సాగులో అపరాలు వేసి  మరింత అభివృద్ధి చెందాలని మండల వ్యవసాయ అధికారి బర్ల అశోక్ కుమార్ అన్నారు. మండలంలోని లాగరాయి పంచాయితీ పరిధిలో శుక్రవారం  రైతు చైతన్య యాత్రలు సర్పంచ్ ఘని లక్ష్మి ఆధ్యర్యంలో జరిగాయి.  ఈ సందర్భంగా మండల వ్యసాయాధికారి అశోక్ కుమార్ మాటలాడుతూ  అంతర పంటలు వేసి  నమోదు చేయించుకోవాలనిరబీ సాగు లో అపరాలు లను వేయాలి అని,చిరుధాన్యాలు సాగు ను ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బొడ్డు వెంకట రమణ మాట్లాడుతూ  మల్బరీ, చేపల పెంపకం సాగు ను రైతులు చేసి అధిక ఆదాయం పొందాలని సూచించారు. సర్పంచ్  మిరియాల గని లక్ష్మి  మాట్లాడుతూ ఫిబ్రవరి నెల ఆఖరు వరకు పంచాయతీ లో పశువులను కట్టాలని, అందుకు రైతులు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం సర్పంచ్, చైర్మన లచేతుల మీదుగా అపరాలు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమం లో మత్స్య శాఖ సహాయకులు శివ సాయి, పశు సంవర్దక శాఖ సహాయకులు రాజు, పట్టు పరిశ్రమ శాఖ సహాయకులు రాము, ఉద్యాన సహాయకులు రామ రాజు, వార్డు సభ్యులు , వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు