ట్రెండింగ్

పోర్టల్ | ఈ - పేపర్ 

25.9 C
Kākināda
శుక్రవారం, సెప్టెంబర్ 17, 2021

నాటు సారా తయారీ స్థావరాలు మరియు అమ్మకాలు పై ఎస్ ఇ బి దాడులు

నాటు సారా తయారీ స్థావరాలు మరియు అమ్మకాలు పై ఎస్ ఇ బి దాడులు

3200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

55 లీటర్ల నాటుసారా తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:

జిల్లా ఎస్పి ఎం. రవీంద్ర నాధ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా ఎస్ ఇ బి ఎడిషనల్ ఎస్ పి, అసిస్టెంట్ కమీషనరు, ఎస్ ఇ బి వారి ఆదేశాలతో రెండు రోజులుగా నాటు సారా తయారీ స్థావరాలు మరియు అమ్మ కాలు పై విస్తృత దాడులు నిర్వహించి రంగంపేట మండలం ఈలకొలను,సుభద్రంపేట,వడిసలేరుగ్రామాలుమరియు అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామాలలో దాడులు నిర్వహించి 5 కేసులు పట్టు కున్న ట్లు,నాటు సారాతయారీకి ఉపయోగించే 3వేల 200లీటర్ల నాటు సారా కాయుటకు ఉపయోగించే పులిసిన బెల్లపుఊట ధ్వంసం చేసినట్లు, 55లీటర్ల నాటు సారా తో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ కి పంపినట్టు గా రాయవరం ఎస్ ఇ బి ఇనస్పెక్టర్ ఎన్ ఎస్ వేణు మాధవ్ తెలియచేసారు.ఈ దాడులలో ఎసై శేఖర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ బాబూరావు మరియు సిబ్బంది కూడా పాల్గొన్నారు. పై విషయములు తెలుపుతూ నాటు సారా తయారీ, అమ్మ కాలు, బెల్టు షాపులు, అనధికార మద్యం పై సమాచారం ఉన్న ఎడల 9440902413, 9440374998నంబర్ లకుసమాచారం ఇవ్వమని ప్రజలను కోరారు. అవి తెలిపిన వారి వివరములు బయటకు వెల్లడి చేయము అని తెలిపారు.

సంబందిత వార్తలు

పబ్లిక్ పోల్

ఈటెల స్వంత పార్టీ పెట్టుతె ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా ?
For Ads Please Contact 9246033999

టాప్ 5 న్యూస్

Wanted Reporters

For Ads Please Contact 9246033999

తాజా వార్తలు